సంబంధిత వార్తలు
- మైక్ పట్టుకుంటేనే వల్లమాలిన ప్రేమ ఒలకపోవడమే ఇండస్ట్రీ తీరు.. తేల్చి చెప్పిన ఎస్.వి. రంగారావు
- మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు.. కేకలు వేయడంతో పరుగో పరుగు (Video)
- హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు.. రూ.1,525 కోట్లు కేటాయింపు
- "TG 09 A 9999" నంబర్‌కు రూ.19లక్షల బిడ్.. ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎగబడుతున్నారు..!
- రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేస్తున్న బాలుడిని ఢీకొట్టిన కారు టైరు... షాకింగ్ ఘటన...
పెళ్లి విషయంలో ఒత్తిడికి గురైన టెక్కీ... దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య!!
పెళ్ళి విషయంలో ఒత్తిడికిలోనై ఓ యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. రాయదుర్గం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన ఆఫీసుకు వెళ్లిన బాలాజీ రాత్రి పొద్దుపోయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా, స్విచాఫ్ అని వచ్చింది. అతడి స్నేహితులను కనుక్కున్నా బాలాజీ జాడ తెలియరాలేదు. దీంతో వారు మరుసటి రోజు రాయదుర్గం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలాజీ పని చేస్తున్న కంపెనీలో విచారించగా అతడు ఆ రోజు పని ముగించుకుని రాత్రి 8.30 గంటలకు బయటకు వెళ్లినట్టు తెలిసింది. దీంతో, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడు కేబుల్ బ్రిడ్జి నుచి దుర్గంలో చెరువులోకి దూకినట్టు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం చెరువులో అతడి మృతదేహం లభించింది. ఐడీ కార్డుతో మృతుడిన బాలాజీ గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించ్ారు.
కాగా, బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయగా ఈ విషయాన్ని బాలాజీ తన ఇంట్లోవారికి చెప్పలేక ఒత్తిడి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు.
