సంబంధిత వార్తలు
- ఈ నెల 6వ తేదీన కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ..
- కాళేశ్వరం ప్రాజెక్టు: కేసీఆర్ రూ.2.8 లక్షల కోట్లు అలా ఖర్చు చేశారు..?
- కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకంగా లేదు: కాగ్ రిపోర్ట్
- కాళేశ్వరం బ్రిడ్జి విరిగిపోయిందా.. వాళ్లు ఎక్స్పర్ట్ ఇంజనీర్లా?: కేటీఆర్
- 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు కానున్న ఖైరతాబాద్ వినాయకుడు
ఇంట్లో కాలు జారి పడ్డానని చెప్తే సాయం కోసం వెళ్లింది.. చివరికి అత్యాచారం?
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్.. తాను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరించాడు.
భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎవరికైనా చెప్తే ఇదే చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి అత్యాచారానికి చేశాడు. తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.
