గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జూన్ 2024 (22:07 IST)

70 అడుగుల ఎత్తులో ఏర్పాటు కానున్న ఖైరతాబాద్‌ వినాయకుడు

khiratabadh ganesh
ఖైరతాబాద్‌లోని గణేష్‌ విగ్రహం గతం కంటే ఈ ఏడాది ఎక్కువ ఎత్తులో ఏర్పాటు కానుంది. సోమవారం నిర్జల ఏకాదశి సందర్భంగా సంప్రదాయబద్ధంగా కర్ర పూజ నిర్వహించారు. గతేడాది ఈ విగ్రహం 63 అడుగుల ఎత్తు ఉండేది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం 70 అడుగుల ఎత్తుతో సిద్ధం కానుంది. 
 
ఈ వినాయకుడు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ ఉత్సవ్ సమితి సభ్యులు నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. మట్టితో విగ్రహాన్ని తయారు చేయనున్నారు. గణేష్ ఉత్సవాల్లో హైదరాబాద్ ప్రజలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వారికి కూడా ఈ భారీ విగ్రహం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలువనుంది.