సోమవారం గణేశుడిని పూజించడం ద్వారా..
గణేశుడిని సోమవారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అడ్డంకులను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా శుభాలు చేకూరుతాయి. గణేశుడిని పూజించడానికి సోమవారం ఉత్తమమైన రోజు. అంతే కాకుండా సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని పూజించడం వల్ల విజయం, సంపదలు లభిస్తాయి.
సోమవారం పొద్దున్నే లేచి స్నానం చేసి వినాయకుడిని సిద్ధం చేయండి. ఎర్రటి వస్త్రం, వినాయకుడికి గరికను, ఇష్టమైన పువ్వులు ఉంచి, వినాయకుడి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. గణేశుడికి కొబ్బరికాయను సమర్పించి, పూజ ముగిసే సమయానికి దానిలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా సోమవారం వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది.