1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-02-2024 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్ప సిద్ధి..

Dhanur Raashi
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ|| దశమి ప.12.41 జ్యేష్ట తె.3.49 ఉ.వ.9.16 ల 10.53. ప.దు. 12.36 ల 1.21 పు.దు. 2.52ల 3.37.
మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరుకావటంతో నిలిచిపోయిన పనులు పున ప్రారంభమవుతాయి.
 
వృషభం :- రాజకీయ నాయకులు సభాసమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోళ్ళలో ఏకాగ్రత వహించండి. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మిథునం :- వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. వృత్తిపరంగా ఎదురైన సమస్యలు క్రమేణా తొలగిపోగలవు. ఉద్యోగస్తులు అధికారులకు మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. 
 
కర్కాటకం :- స్థిరాస్తి అమ్మకంపై ఆలోచనలు అధికమవుతాయి. ధన సహాయం, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థులు వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. సోదరీ, సోదరులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
సింహం :- ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
కన్య :- ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలుమాని ఏకాగ్రతతో పనిచేయటం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల నిర్లక్ష్య వైఖరి మీకెంతో నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదురైనా అధికమిస్తారు.
 
తుల :- ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషణసాగిస్తారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అసవరం. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు.
 
వృశ్చికం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులకు ఒత్తిడి, అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయం ఎంతో సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది.
 
ధనస్సు :- స్త్రీలకు పనిభారం అధికం. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు.
 
మకరం :- పెద్దలను నుంచి అవమానాలు తలెత్తుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ఉపాధ్యాయులు పనిభారం అధికమవుతుంది. రుణం తీర్చటానికై చేయుయత్నం వాయిదా పడుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి.
 
కుంభం :- స్త్రీలు అపరిచితులను అతిగా విశ్వసించటం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. అధ్యాపకులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. బంధువులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
మీనం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికిపనివారితో చికాకులు తప్పవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వలన ఇబ్బందిపడతారు. విద్యార్థులు బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ప్రయాణాలను ఆకస్మికంగా వాయిదా వేస్తారు.