బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-02-2024 శుక్రవారం మీ రాశిఫలాలు - ఇష్టకామేశ్వరిదేవిని పూజించడం వల్ల సర్వదా శుభం...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య బ|| సప్తమి ఉ.11.29 స్వాతి రా.1.49 ఉ.శే.వ.7.52 కు ఉ.దు. 8.50 ల 9.35 ప. దు. 12.36 ల 1.21.
 
ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు.
 
వృషభం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. జాయింట్ వెంచర్లు, ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఒత్తిడి ఎదుర్కుంటారు. రుణం పూర్తిగా తీర్చి తాకట్లు విడిపించుకుంటారు. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది.
 
మిథునం :- దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రులకు పాత బాకీలు చెల్లిస్తారు. బంధువుల విషయంలో మీ ఊహలు నిజమవుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసివస్తాయి. ప్రేమికులకు ఎడబాటు, ఇతరత్రా చికాకులు తప్పవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారుఅచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగాఉన్నారు.
 
సింహం :- సిమెంటు, కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. విద్యార్ధులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. శ్రీమతిసలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
 
కన్య :- అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు, పథకాలతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కొన్ని విషయాలు మీకు నచ్చకపోయినా సర్దుకుపోవలసి ఉంటుంది.
 
తుల :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. బంధువులతో సఖ్యత ఏర్పడటంతో రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బ్యాంకు వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి.
 
వృశ్చికం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. దుబారా ఖర్చులు అధికం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు.
 
ధనస్సు :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు కలసిరాగలవు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి వృత్తిపరమైన సమస్యలు వంటివి ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీలో సహనం లోపించటం వల్ల చీటికిమాటికి అసంతృప్తికి లోనవుతారు.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు ఊరటనిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమన్వయం ఏర్పడుతుంది. మీ యత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహంలభిస్తుంది.
 
కుంభం :- ఆరోగ్య, ఆహార విషయాలో మెళుకువ అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించటం క్షేమదాయకం. సంఘంలో మీ మాటకు గౌరవం, ఆమోదం లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
మీనం :- ఉద్యోగస్తులకు రావలసిన మెడికల్ క్లయంలు, అలవెన్సులు అందుతాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి.