మేషం :- కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందుతారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. మీరు ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. ప్రియతములను కలుసుకుని విలువైన కానుకల్చిపుచ్చుకుంటారు.
వృషభం :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు, రాణింపులభిస్తుంది.
మిథునం :- చేతి వృత్తుల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపోహలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాలవల్ల ఇబ్బందు లెదురవుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏమాత్రం ఉండదు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది.
కర్కాటకం :- సంతానం భవిష్యత్తు కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, అభిప్రాయాలు మార్చుకోవలసి ఉంటుంది. మత్స్య, కోళ్ల, పాడి పరిశ్రమల వారికి పురోభివృద్ధి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
సింహం :- పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. ఇతరుల సహాయం అర్ధించటానికి మొహమ్మాటం అడ్డువస్తుంది.
కన్య :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారి, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో వేడుకులు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. మీ కళత్ర వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. చేపట్టిన పనులుఒక పట్టాన పూర్తి కావు.
తుల :- కార్యసాధనకు బాగా శ్రమించవలసి ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. అయిన వారే మిమ్ములను అపార్థం చేసుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ శ్రీమతిని, పిల్లలను మెప్పించటం కష్టమవుతుంది. ఉన్నతస్థాయి అధికారులకు ఆకస్మిక స్థానచలనం లేదా ప్రయాణం చేయవలసివస్తుంది.
వృశ్చికం :- ధనం ఎంతవ్యయం చేసినా ఫలితం ఉండదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు మనస్థిమితం ఉండదు. ప్రతి విషయంలోను ఏమరుపాటుగా ఉంటారు.
ధనస్సు :- పారిశ్రామిక రంగాల వారికి ఊహించని ఆటంకాలెదురవుతాయి. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. వృత్తుల వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. నూతన పరిచయాలేర్పడతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
మకరం :- ప్రముఖులతో లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణాలు, మర్మతులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పొల్గొంటారు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి.
కుంభం :- ఊహించని ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు.
మీనం :- ప్రైవేట్ ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నూతన వెంచర్ల విషయంలో పునరాలోచనమంచిది.