Refresh

This website telugu.webdunia.com/article/astrology-daily-horoscope/today-23-01-2024-daily-horoscope-124012200044_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-01-2024 మంగళవారం మీ రాశిఫలాలు - అష్టలక్ష్మీని పూజించిన శుభం, జయం...

astro10
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు|| త్రయోదశి రా.8.57 అరుద్ర పూర్తి ప.వ. 2.40 ల 4. 19.
ఉ.దు. 8.46 ల 9.30 రా.దు. 10.45 ల 11.37.
అష్టలక్ష్మీని పూజించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- దంపతుల మధ్య తరచూ చిన్నచిన్న తగవులు, మాట పట్టింపులు చోటుచేసుకుంటాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. గృహనిర్మాణాలకు కావలసిన బ్యాంకులోన్లు మంజూరు కాగలవు. 
 
వృషభం :- వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధికమిస్తారు. మీ సమర్థత, నిజాయితీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికాక చికాకు కలిగిస్తాయి. స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మిథునం :- ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్సులు, లీవులు మంజూరవుతాయి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. ప్రైవేటు ఫైనాన్సు సంస్థలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు.
 
కర్కాటకం :- షాపింగ్‌ను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. కోర్టు వ్యవహరాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
సింహం :- మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రైవేటు ఫైనాన్సు సంస్థలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి.
 
కన్య :- ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, అడ్వాన్సులు, లీవులు మంజూరవుతాయి. షాపింగులోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి కేంద్రికరించడం ముఖ్యం. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
తుల :- సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. కోర్టు వ్యవహరాలు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. ధనం ఎంత వెచ్చించినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. స్త్రీలకు వస్త్ర, వస్తు ప్రాప్తి వంటి శుభ ఫలితాలున్నాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయటం క్షేమదాయకం.
 
ధనస్సు :- పెండింగ్ పనులు పూర్తి కాకపోవటంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు చికాకులు వంటివి ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధు మిత్రులు వ్యతిరేకిస్తారు.
 
మకరం :- మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. ధనం ఎంత వెచ్చించినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అధికారుల నుంచి అభ్యంతరాలు తప్పవు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
కుంభం :- ఆస్తి వ్యవహరాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. నిరుద్యోగులు చేపట్టినఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, స్వీట్ షాపు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.