1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-01-2024 సోమవారం మీ రాశిఫలాలు - సదాశివుని ఆరాధించినా...

astro8
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ ద్వాదశి రా.8.52 మృగశిర తె.6.01 ఉ.వ.11.22 ల 12.59. ప.దు. 12.24 ల 1.08 పు. దు. 2. 36 ల 3.20.
సదాశివుని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటలు, తినుబండ వ్యాపారులకు, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయరంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రయాణాల వ్యవహారాలలో మెళకువ వహించండి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాలవారికి కలిసిరాగలదు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం.
 
మిథునం :- మార్కెటింగ్ రంగాల వారికి, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కర్కాటకం :- ఊహించని ఖర్చులు అధికం కావటంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. కుటుంబ, ఆర్థికపరిస్థిలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల రాకతో పనులు వాయిదా పడటం మంచిది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
సింహం :- ఆర్థిక ఇబ్బంది అంటూ లేక పోయిన సంతృప్తి వుండజాలదు. స్త్రీలకు అపరిచితుల పట్ల మెళకువ వహించండి. విద్యార్థులు విద్యా విషయాల్లో శ్రద్ధ వహించలేక పోవటం వల్ల పెద్దలతో మాటపడక తప్పదు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నంలో సఫలీకృతులవుతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కన్య :- చిన్న చిన్న విషయాలలో ఉద్రేకపడటం మంచిది కాదని గ్రహించండి. మిత్రుల రాకతో గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలమైన కాలం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు బంధువుల తాకిడి వల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
తుల :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం. సినిమా, కళా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికం కాగలవు. మొండిబాకీలు వసూలువుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి పొందుతారు. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. తలపెట్టిన పనుల్లో కొంత ముందు మెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ఊహించని ఖర్చులు, బంధువులరాక వల్ల మానసికాందోళన తప్పదు.
 
ధనస్సు :- ఆలయాలను సందర్శిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా మీరుతీసుకున్న ఒక నిర్ణయం కుటుంబీకులను బాధించగలదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. కాంట్రాక్టర్లు ఒకే సమయంలో అనేక పనులు చేపట్టటం వల్ల విమర్శలు, త్రిప్పట అధికమవుతాయి.
 
మకరం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభాదాయకంగా ఉంటుంది. ఇతరుల కారణంగా మీ పనులు, కార్యక్రమాలు వాయిదా పడటంతో నిరుత్సాహం తప్పదు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. చిట్స్, ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగాల్లోవారికి మెళకువ అవసరం.
 
కుంభం :- నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలు, నడుముకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక వ్యవహారాల పట్ల శ్రద్ధ వహిస్తారు. విద్యార్ధినులలో ఏకాగ్రత లోపం వల్ల ఆందోళనకు గురిఅవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- ప్రముఖులను కలుసుకుంటారు. నిర్వహణ లోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. మిత్రుల సహాయ సహకారాలు అందించడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారమార్గం కానరాగలదు. ఇతరులకు ధన సహాయం చేసి ఇబ్బందులకు గురవుతారు.