సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-01-2024 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...

astro5
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ నవమి రా.11.33 అశ్వని ఉ.7.14 భరణి తె.6.22 సా.వ.4.29 ల 6.02. ఉ.దు. 8.47 ల 9.31 ప.దు. 12.27 ల 1.11. పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు నెరవేరుతాయి.
 
మేషం :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణ కొంతైనా తీర్చలన్న మీయత్నం ఫలిస్తుంది.
 
మిథునం :- ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సమస్యలు, చికాకులు క్రమంగా సర్దుకుంటాయి. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం :- స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. యాదృచ్ఛికంగానే దుబారా ఖర్చు లుంటాయి. బంధువులను కలుసుకుంటారు.
 
సింహం :- నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేట్ సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఏ విషయాన్ని తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మీ గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి, లాభాలు గడిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆకస్మింకగా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
తుల :- దీర్ఘకాలిక రుణాలు తీరు ఊరట చెందుతారు. వాణిజ్య ఒప్పందాలు, వ్యవహరాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
 
వృశ్చికం :- చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాలలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
ధనస్సు :- ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఖర్చులు అధికమవుతాయి. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
మకరం :- మీ శ్రీమతి సహాయం లేనిదే మీ సమన్యలు పరిష్కారం కావని గ్రహించండి. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒకింత అసహనానికి లోనవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- ప్రముఖులను కలుసుకుంటారు. మీ బాధ్యతలు, ముఖ్యమైన పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందులకు గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలుంటాయి. స్త్రీలు పట్టింపులకు పోకుండా సర్దుకుపోవటం మంచిది. కుటుంబీకుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది.
 
మీనం :- స్త్రీలు అపరిచితులతో మితంగా సంభాషించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొబ్బరి, పండ్లు పూల వ్యాపారులకు లాభం. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.