1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-01-2024 శనివారం దినఫలాలు - విఘ్నేశ్వరుని ఆరాధించిన...

astro6
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ దశమి రా.10.13 కృత్తిక తె.5.50 సా.వ.6.06 ల 7.40. ఉ. దు. 6.35ల 8.03.
విఘ్నేశ్వరుని ఆరాధించిన సర్వ విఘ్నాలు తొలగిపోతాయి.
 
మేషం :- ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయుకృషిలో సఫలీ కృతులవుతారు. ఖర్చులు అధికమవుతాయి. పీచు, ఫోమ్, లెదర్, చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు ఆశాజనకం. మిత్రులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడకతప్పదు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి.
 
మిథునం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. షేర్లు, యూనిట్ల క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమ వారికి ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం.
 
కర్కాటకం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఆందోళన అధికమవుతుంది. కార్మిక బకాయిలు, పి.ఎఫ్. బకాయిలు ఒక కొలిక్కి రాగలవు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు ఆశాజనకం. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలాముఖ్యం.
 
సింహం :- వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
కన్య :- స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు, ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం.
 
తుల :- వ్యవసాయ కూలీలు,కార్మికులకు ఆశాజనకం. మిత్రులను ఒక వ్యవహారంలో అతిగా విశ్వసించటం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. పట్టు, చేనేత, ఫ్యాన్సీ, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి బకాయిల వసూలు విషయంలో సమస్యలు తప్పవు.
 
వృశ్చికం :- సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. స్త్రీల మనోవాంఛలు, యత్నాలు నెరవేరటం వల్ల వారిలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, ఆల్కహాలు వ్యాపారులకు కలిసిరాగలదు. నిరుద్యోగుల ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది.
 
మకరం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి. తగు ప్రోత్సాహం లభిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. ప్రైవేటు రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ప్రయాణాలలో వస్తువులు జారవిడుచుకునే ఆస్కారం వుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి.
 
కుంభం :- బేకరి, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకం. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. పారిశ్రామిక రంగాల్లో వారు స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి సంతృప్తి కానవస్తుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు.
 
మీనం :- ముఖ్యుల రాకపోకల వల్ల అనుకోని ఖర్చులు అధికమవుతాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కార్మికులతోను, అధికారులతోను చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.