బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-01-2024 శుక్రవారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన శుభం...

astro12
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ|| పాఢ్యమి రా.12.08 పుష్యమి ఉ.9.56 రా.వ.11.54 ల 1.39. ఉ.దు. 8.47 ల 9.31 ప. దు. 12.27 ల 1.11.
శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో పూజించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. హోటల్, తినుబండరాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి.
 
వృషభం :- ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటికి వ్యక్తం చేయకండి. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.
 
మిథునం :- స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో ఆసక్తి, ఉత్సాహంగా పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమానుబంధాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రైవేటు సంస్థల్లో వారికి అభివృద్ధి కానరాగలదు. ప్రయాణాల్లో సంతృప్తి కానవస్తుంది.
 
సింహం :- గృహంలో నూతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు తోటివారి కారణంగా చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు ప్రతివిషయంలో ఓర్పు, నేర్పు అవసరమని గమనించండి.
 
కన్య :- సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతోముఖ్యం. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. పాత మిత్రుల గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి.
 
తుల :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో అపరిచితులను అతిగా విశ్వసించటం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. నిరుద్యోగుల యత్నాలు కలిసిరాగలవు. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తికావడంతో ఒకింత కుదుటపడతారు. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
వృశ్చికం :- రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు :- విద్యా, వైద్య సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు.
 
మకరం :- సన్నిహితుల మధ్య రహస్యాలుదాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి.
 
కుంభం :- వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు చేతిలోపని పూర్తి కావడంతో ఒకింత కుదుటపడతారు.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.