బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 27 జనవరి 2024 (17:02 IST)

28.01.2024 నుంచి 03.02.2024 వరకు మీ వార రాశిఫలాలు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యమైన కార్యాలు విజయవంతమవుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. శనివారం నాడు ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి. మిత సంభాషణ శ్రేయస్కరం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిశ్చితార్ధంలో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పుతో శ్రమిస్తే విజయం తథ్యం. మనోధైర్యంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు సమయం కాదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆది, సోమవారాల్లో నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రతి విషయం జాగ్రత్తగా పరిశీలించాలి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యపరుస్తుంది. సంతానం చదువులపై దృష్టి సారించండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి ఉంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం. నిరుద్యోగులకు శుభయోగం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
సత్కాలం ఆసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు బలపడతాయి. గృహమరమ్మతులు చేపడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. బుధ, గురువారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శుకనాల ప్రభావం అధికం. మనోధైర్యంతో వ్యవహరించండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానానికి శుభయోగం. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఓర్పుతో వివాహయత్నాలు కొనసాగిస్తారు. దళారులు, కన్సల్టెంటీలను నమ్మవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆదివారం నాడు పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. నగదు, పత్రాలు జాగ్రత్త. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోబలంతో యత్నాలు సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. సంతానానికి శుభయోగం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు, అంకితభావం ప్రధానం. ఉద్యోగస్తులకు వేధింపులు అధికం. సహోద్యోగుల సాయం అందిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. శుక్రవారం నాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసరపడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఆదాయం సంతృప్తికరం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఆదివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సొంతంగా ఏదైనా చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. వేడుకకు హాజరవుతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
యత్నాలు పురోగతిన సాగుతాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సమష్టికృషితో అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ప్రారంభించిన పనులు ఆపివేయవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానానికి శుభయోగం. సంతోషకరమైన వార్తలు వింటారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అదృష్టయోగం ఉంది. అవకాశాలను వదులుకోవద్దు. సామరస్యంగా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. బుధవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాలు ఉపందుకుంటాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్ల ఆదాయం బాగుంటుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. మానసికంగా స్థిమితపడతారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సమష్టి కృషితో కార్యం సాధిస్తారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. గృహప్రశాంతత, సంతానం సౌఖ్యం ఉన్నాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయాలి. ముఖ్యమైన వ్యవహారాలతో తీరిక ఉండదు. కొన్నిటిలో అనుకూలత, మరికొన్నిటిలో వ్యతిరేకత ఎదుర్కుంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. శుక్ర, శనివారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా స్థిమితపడతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ముఖ్యం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు చేపడతారు. శుభకార్యానికి హాజరుకాలేరు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
విజ్ఞతతో మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. మిత సంభాషణ శ్రేయస్కరం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. శుభకార్యానికి శ్రీకారం చుడతారు. ఆశించిన సంబంధం కుదరదు. ఇదీ ఒకందుకు మంచిదే. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. గృహనిర్మాణాలు వేగవంతమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.