బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-01-2024 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని పూజించిన శుభం...

mesham
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య బ|| విదియ రా.2.01 ఆశ్రేష ప.12.08 రా.వ.1.22 ల 3.08. ఉ. దు. 6.35 ల 8.03.
అనంతపద్మనాభస్వామిని పూజించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారులకు కలిసిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు పని వారలతో చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు.
 
వృషభం :- ప్రముఖులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. కాంట్రాక్టర్లు ఒకే సమయంలో అనేక పనులు చేపట్టడం వల్ల విమర్శలు, త్రిప్పట అధికమవుతాయి. పీచు, ఫోం, లెదర్ వ్యాపారులకు కలిసిరాగలదు. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
మిథునం :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వల్ల చికాకులు తప్పవు. ఉప్యాయులకు అధిక శ్రమ, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం :- ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. క్రీడ, కళా, రచన, పత్రికా రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం తప్పదు. బిల్లులు చెల్లిస్తారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి.
 
సింహం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. చేపట్టిన పనుల్లో కొంత ముందు మెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
కన్య :- పుణ్య కార్యాలలో చురుకుగా వ్యవహరించి ఆందరినీ అకట్టుకుంటారు. లైనంత వరకూ మీపనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువవహించండి.
 
తుల :- కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. బంధు మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ధనం విరివిగా వ్యయం అయినా సార్థకత ప్రయోజనం ఉంటాయి. తోటి వారితో స్నేహ భావంతో సంచరిస్తారు. ధాన్యం, కలప, పత్రిక, యాంత్రిక వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం తప్పవు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సాను కూలమవుతుంది. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తిని అమర్చుకుంటారు. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సిమెంటు, ఇటుక వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ వహించండి.
 
కుంభం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో వారికి విరోధులు చేసే ప్రయత్నాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది
 
మీనం :- వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులు పనివారలను కనిపెట్టటం మంచిది. స్త్రీల సహకారంతో మీ దీర్ఘకాలిక సమస్య ఒక కొలిక్కి వచ్చేరాగలదు. ఫైనాన్సు, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఏదైనా అమ్మటానికై చేయుప్రయత్నాలు వాయిదా పడటంమంచిది. ప్రేమికులకు మధ్య విభేదాలు తలెత్తగలవు.