బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (09:01 IST)

01-02-2024 గురువారం దినఫలాలు - సాయిబాబాను దర్శించి, పూజించిన సర్వదా శుభం...

kanya rashi
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య బి॥ షష్ఠి ఉ. 10.07 చిత్త రా.12.11 ఉ.వ. 6.48 ల 8. 32,
తె.వ.6.09 ల ఉ.దు. 10.20 ల 11.06 ప.దు. 2.51 ల 3.36.
సాయిబాబాను దర్శించి, పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ప్రముఖుల కలయిక అనుకూలించదు. కోర్టు వ్యవహరాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో మొహమ్మాటలకు తావివ్వటం మంచిది కాదు. ఏ విషయంలోను సర్దుకుపోవటానికి మనస్సు అంగీకరించదు.
 
వృషభం :- ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. ఎలక్ట్రానిక్ ఛానెళ్ల సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. అధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులవైఖరి మీకెంతో ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.
 
మిథునం :- ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. గిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. అనుకున్న పనులు వాయిదా వేయడటం మంచిది.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ జీవితభాగస్వామి సలహా పాటించటం వల్ల మేలు జరిగే అవకాశముంది. ఓర్పు, చాకచక్యంతో చిక్కు సమస్యలను సరిచేసుకుంటారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. ఎవరికీ హామీలు ఉండం మంచిదికాదు.
 
సింహం :- నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు లైసెన్సులు మంజూరవుతాయి. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగులు సహకరించక పోవటంతో నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకు ఇవ్వటం మంచిదికాదు.
 
కన్య :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాసమళ్ళుతుంది. వృత్తిపరంగా ఎదుర్కుంటున్న ఆటంకాలు సమసిపోగలవు. రావలసిన బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవటం మంచిది.
 
తుల :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో మెళకువ అవసరం. మీ మనస్సుకు నచ్చని విషయాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించవలసివస్తుంది.
 
వృశ్చికం :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడతాయి. మీరంటే గిట్టని వారికి మేలు చేసి వారిని మీవైపు తిప్పుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు ప్రశంసిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి.
 
ధనస్సు :- వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందలింపులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
మకరం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్‌పోర్టు, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు.
 
మీనం :- ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అకాలభోజనం, శ్రమాధిక్తవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.