ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-02-2024 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని పూజించిన మీ సంకల్పం...

tula rashi
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ|| నవమి ప. 12.49 అనూరాధ తె.3.39 ఉ.వ. 7.05 ల 8.44. సా.దు. 4.22 ల 5.07.
ఆదిత్యుని పూజించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే ఆస్కారం ఉంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా పూర్తిగా అందుతుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
వృషభం :- బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ముందుచూపుతో వ్యవహరించుట మంచిది.
 
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. స్త్రీలకు పనివారలతో చికాకలు తప్పవు. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. సన్నిహితులతో కలిసి దైవ, శుభకార్యాలలో పాల్గొంటారు. క్యాటరింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
 
కర్కాటకం :- నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. 
 
సింహం :- పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయనాయకులు తరచూ సభాసమావేశాలలో పాల్గొంటారు. చేనేత, కళంకారీ, ఖాదీ, నూలు వస్త్ర వ్యాపారులకు శుభదాయకం. ఊహించని ఖర్చులుంటాయి. రేపటి గురించి ఆందోళన చెందుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
కన్య :- ద్విచక్ర వాహనంపై ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ వ్యక్తికీ పూర్తిగా బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. 
 
తుల :- నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయలేర్పడతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో వస్త్రా, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయంచేస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
మకరం :- విద్యార్థులకు మిత్ర బృందాలు పెరుగుతాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సొంత వ్యాపారాలు ఆశించినంత సంతృప్తికరంగా ఉండవు. క్రయ విక్రయాల్లో దూకుడు తగదు.
 
కుంభం :- ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించండి. స్థిరచరాస్తుల వ్యవహారాలు ఒకంతట పరిష్కారం కాకపోవటంతో ఆందోళన చెందుతారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
 
మీనం :- మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తుంది. విందులలో పరిమితి పాటించండి. నిత్యవసర వస్తు ధరలు అధికమవుతాయి.