శ్వేతార్క గణపతికి బుధవారం నాడు ఆవుపాలను నైవేద్యంగా సమర్పిస్తే..?
బుధవారం గణేశుడిని పూజించడం విశేష ఫలితాలను అందిస్తుంది. గణేశుడిని పూర్తి భక్తి, విశ్వాసంతో పూజిస్తే జీవిత కష్టాలు తీరుతాయని విశ్వాసం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారు బుధవారం నాడు విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఈతిబాధలుండవు. అలాగే బుధవారం శ్వేతార్క గణపతికి అభిషేకం చేసి.. ఆవు పాలను నైవేద్యంగా సమర్పించిన వారికి సర్వం సిద్ధిస్తుంది. అలాగే బుధవారం పూట ఆవు పాలు, లడ్డూ, గరికను శ్వేతార్క గణపతికి నైవేద్యంగా సమర్పించి పూజించే వారికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఆదాయానికి లోటు వుండదు.
లక్ష్మీదేవిని బుధవారం నాడు కూడా ధనప్రాప్తి కోసం పూజించాలి. లక్ష్మీ దేవికి గులాబీ దండ, పాయసాన్ని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఇలా చేస్తే ధన యోగం చేకూరుతుంది. బుధవారాల్లో గణేశుడికి 21 లేదా 42 జవిత్రిలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.