సంబంధిత వార్తలు
- హైదరాబాదులో మొట్టమొదటి డిజైన్ షో- డిజైన్ వాన్గార్డ్ 2024
- చరిత్రను గుర్తు చేసుకోవయ్యా రేవంతన్న.. కేటీఆర్ ధ్వజం
- ఎల్.బి.స్టేడియంలో రామ్చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్
- స్మార్ట్ఫోన్ల స్మగ్లింగ్, స్నాచింగ్ ముఠా 17మంది అరెస్ట్
- మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం... అడవి పిల్లిగా భావించిన సిబ్బంది...
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం రేపింది. ఈ చిరుతను తొలుత అడవి పిల్లిగా ఎయిర్ పోర్టు సిబ్బంది భావించారు. ఆ తర్వాత కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరశీలించి చిరుత పులిగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పిమ్మట దీన్ని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేసి చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు సూచించారు చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పరిసరాలలో అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రం గోడ దూకి లోపలికి వచ్చినట్టు అధికారులు సీసీ కెమెరాల్లో గుర్తించారు ప్రహరీ గోడ దూకే సమయంలో చిరుత ఫెన్సింగ్ వైర్లను తాకిన ఆనవాళ్లను అధికారులు గుర్తించడం జరిగింది. మూడేళ్ల క్రితం కూడా ఇలానే చిరుత ఎయిర్‌పోర్టులో తిరిగినట్టు అధికారులు గుర్తించారు. అయితే, సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అధికారులు దాన్ని అడవి పిల్లిగా గుర్తించారు. ఈసారి కూడా అడవి పిల్లినే కావొచ్చని మొదట ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమానించింది. కానీ, అటవీశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చిరుతగా నిర్ధారించారు.
తర్వాతి కథనం
