శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (10:32 IST)

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Game Changer Climax set LB Stadium
Game Changer Climax set LB Stadium
తమిళదర్శకుడు శంకర్ నేత్రుత్వలో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా గత ఏడాదినుంచీ కొనసాగుతుంది. ఇది సమాలీన రాజకీయాలకు ముఖచిత్రంగా వుండనున్నదని తెలుస్తోంది. ఇప్పటికే చాలా పార్ట్ పూర్తి చేశారు.  విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో ఈనెలారంభంలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మరలా కొంత గేప్ తీసుకుని వందలాది మంది జూనియర్స్ మధ్య గత రెండు రోజులుగా మరికొన్ని సీన్స్ తీశారు.
 
Game Changer Climax set LB Stadium
Game Changer Climax set LB Stadium
ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. రెండో పాత్ర కలెక్టర్. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పాత్ర అతనిది. ఒకప్పుడు రాజకీయనాయకులు మంత్రులు ఇదే కలెక్టర్ ను హేళన చేయగా రామ్ చరణ్ సవాల్ విసురుతాడు. దానికి తగినవిధంగా అదే కలెక్టర్ ను తాము అధికారంలో వచ్చాక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా పోలీసు బలగంతో రామ్ చరణ్ కాపలాగా వుండేలా సీన్ చిత్రీకరించినట్లు సమచారం. ఈ సందర్భంగా పలు పవర్ ఫుల్ డైలాగ్ లూ వున్నాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీచంద్ర తదితరులు వున్నారు.
 
కాగా, ఈ సన్నివేశానికి కొనసాగింపుగా నేడు షంషాబాద్ లో మరో కీలక సన్నివేశాన్ని శంకర్ చిత్రీకరిస్తున్నాడు. ఎయిర్ పోర్ట్ కు సమీపంలో వుండే ఓ పెద్ద బంగ్లాలో తీస్తున్నట్లు తెలుస్తోంది.