సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (14:04 IST)

సాయి దుర్గా తేజ్ తో 1940 కాలంనాటి చిత్రం !

Sai Durga Tej!
Sai Durga Tej!
సాయి ధరమ్ తేజ్ తన పేరును తన తల్లిపేరు మీదుగా సాయి దుర్గాతేజ్ మార్చుకున్నారు. ఆ తర్వాత ఓ భారీ సినిమాను చేయనున్నారు. ఇటీవలేవంద రోజులు ఆడిన హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి తేజ్ హీరోగా రాకేష్ డైరెక్షన్ చెయ్యనున్నారు. 
 
ఈ మూవీ 1940 కాలంనాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వుంటుందని సమాచారం. ఇప్పటికే తేజ్.. విరూపాక్ష సినిమా చేశాడు. థ్రిల్లర్ కథాంశం కూడా ఇందులో వుంది. కాగా,  ఈ సినిమా  జూలైలో సెట్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే హనుమాన్ సినిమా విడుదలకు మెగాస్టార్ కుటుంబం నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ వుందని తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి సాయితేజ్ ను హీరోగా సినిమా చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.