రాబోయే రెండు వారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు
Telangana Rains
శుక్రవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం మరియు రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి, ఉదయపు వేళల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఇక్కడ వాతావరణం గత రెండు రోజుల్లాగే ఉండనుంది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

