మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 డిశెంబరు 2025 (12:37 IST)

ప్రయాణికులకు శుభవార్త - హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు

TGSRTC
సంక్రాంతి పడుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలై బీహెచ్‌ఈఎల్, మియాపూర్ వైపు నివసించే వారి సౌకర్యార్థం హెచ్ఈఎల్ డిపో నుంచి ఏపీకి ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 
 
ఈ బస్సులు ఆర్సీపురం నుంచి బయలుదేరి మియాపూర్, కేపీహెచ్‌జీ, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళతాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్టణం, పోలవరం తదితర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయని బీహెచ్ఈఎల్ డిపో మేనేజర్ సుధా ఒక పత్రికా ప్రటనలో తెలిపారు. ఈ స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలకు 99592 26149 అనే నంబరులో సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు.