Telangana RTC Jobs: తెలుగు రాయడం, చదవడం వస్తే చాలు.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు
తెలంగాణ ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ భారీ నియామకాలను చేపడుతోంది. విద్యార్హతలతో సంబంధం లేకుండా, తెలుగు చదవడం, రాయడం మాత్రమే తెలిసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యకే పరిమితమై ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి అవకాశం. ఇందులో భాగంగా 1500 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది.
తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండాలి.
భారీ వాహన లైసెన్స్ కలిగి ఉండాలి. ఇందుకు ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. కానీ కనీసం తెలుగులో రాయడం, చదవడం మాత్రమే వచ్చి ఉండాలి, కేవలం మాట్లాడటం కాదు. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్డు ఉండాలి.
టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఈ నియామకాలు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదా రాత పరీక్ష లేకుండా జరుగుతాయి. దరఖాస్తుదారులలో ఎవరు సరిపోతారో ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించి, వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి డిపో స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు రెండు వారాల ముందుగానే శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ సమయంలో, రోజుకు రూ. 200 చెల్లిస్తారు. ఆ తర్వాత, వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. పూర్తి సమయం బస్సు డ్రైవర్‌గా ఎంపికైతే, జీతం రూ. నెలకు 22,415లుగా వుంటుంది.