గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:57 IST)

నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లి 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

gang rape
పాతబస్తీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్‌గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్‌ చేసిన యువకులు.. నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఆ మైనర్‌ బాలికను అక్కడే వదిలివెళ్లిపోయారు.
 
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు భావిస్తున్నారు.