కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' టొయోటా హైలక్స్ విడుదల
ఎట్టకేలకు దేశీయ మార్కెట్లోకి కార్లలో కెల్లా అతిపెద్ద 'బాహుబలి' విడుదలైంది. భారత మార్కెట్లో హైలక్స్ ధరలు రూ.33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. టొయోటా హైలక్స్ పికప్ ట్రక్కును కంపెనీ మూడు వేరియంట్లలో విడుదల చేసింది. టొయోటా కొంతకాలం క్రితమే హైలక్స్ పికప్ కోసం బుకింగ్‌ను నిలిపివేసింది.
మార్కెట్ సమాచారం ప్రకారం, వచ్చేనెలలో టొయోటా హైలక్స్ డెలివరీలు ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అలాగే, ఈ మోడల్ కోసం వచ్చిన అనూహ్య స్పందన కారణంగా, దీని వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి కంపెనీ ఈ మోడల్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
అమెరికా వంటి దేశాల్లో పికప్ వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మనదేశంలో పికప్ ట్రక్కులను కేవలం వాణిజ్య ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే, అమెరికాలో మాత్రం వీటిని సాధారణ వాహనాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో, భారతదేశంలో కూడా రెగ్యులర్ పికప్ ట్రెండ్‌ను ప్రారంభించేందుకు టొయోటా తమ హైలక్స్‌ను తీసుకువచ్చింది.
భారత మార్కెట్లో టొయోటా హైలక్స్ వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైలక్స్ మ్యాన్యువల్ స్టాండర్డ్ - రూ.33.99 లక్షలు హైలక్స్ మ్యాన్యువల్ హై - రూ.35.80 లక్షలు హైలక్స్ ఆటోమేటిక్ హై - రూ.36.80 లక్షలు పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా. ఈ మూడు వేరియంట్లు కూడా స్టాండర్డ్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో లభిస్తాయి.