గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:42 IST)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. పది గంటలకు శాసనమండలి ప్రారంభమైంది. తొలుత ఇటీవల మృతి చెందిన ప్రజాప్రతినిధులకు సంతాపం ప్రకటిస్తారు. తొలిరోజు నుంచే సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఈరోజు జరగబోయే బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేయనున్నారు. మరోవైపు, అసెంబ్లీని రద్దు చేయాలని... మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసురుతోంది.
 
ఇక సమావేశాల తొలి రోజే మూడు రాజధానులపై చర్చ జరగబోతోంది. ఈ నేపథ్యంలో, అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.