1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 4,009 new corona cases in Telangana

తెలంగాణలో కొత్తగా 4,009 కరోనా కేసులు

corona cases
తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 14 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 705 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,18,20,842కి చేరింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
వాట్సాప్ లో 'పింక్ లింక్' పేరిట వచ్చే లింకుల బారిన పడి మోసపోవద్దు