ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు, 10 మంది మృతి

corona virus precautions
ఎం| Last Modified మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (21:34 IST)
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 9,32, 892కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,321 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 25,850 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 8,99,721 మంది రికవరీ అయ్యారు. చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దని వైద్యులు హెచ్చరించారు.
దీనిపై మరింత చదవండి :