బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:50 IST)

43 వేల కోట్లు దోపిడీ చేసే స్థాయి లోకేష్‌ది కాదు: ట్విట్టర్లో అయ్యన్న

ట్విట్టర్లో మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు వైసిపిపైన మండిపడ్డారు. జ‌గ‌న్‌ రెడ్డికి స‌వాల్ విసిరే స్థాయి నారా లోకేష్‌ది కాద‌ని తాడేప‌ల్లి గేటు ద‌గ్గ‌ర‌ పెడిగ్రీ తినే విశ్వాసంతో కొన్ని ఊర‌కుక్క‌లు మొరుగుతున్నాయి.
 
నిజ‌మే జ‌గ‌న్ రెడ్డిలా 43 వేల కోట్లు దోపిడీ చేసే స్థాయి లోకేష్‌ది కాదు. 31 కేసులున్న నేర‌చ‌రిత్ర స్థాయి లోకేష్‌కి లేదు. బాబాయ్ హ‌త్య కేసు ద‌ర్యాప్తుని అడ్డుకునేంత స్థాయి లోకేష్‌కి ఎప్ప‌టికీ రానే రాదు.
 
స‌వాల్‌కి స్పందించాలంటే ద‌మ్ముండాలి కానీ, స్థాయిలెందుకు? వివేకా హ‌త్య‌తో సంబంధం లేక‌పోతే 14న వెంకన్న సాక్షిగా ప్ర‌మాణం చేయ‌మ‌ని మీ య‌జ‌మానికి చెప్పొచ్చు క‌దా అంటూ వ్యాఖ్యలు చేసారు అయ్యన్న.