సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:30 IST)

చంద్రబాబు వద్దంటే లోకేష్ పోటీ చేస్తామంటున్నారే?: ఆళ్ల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పారు కానీ మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ లో విచిత్ర పరిస్థితి నెలకొందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెబితే.. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెబుతున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న లోకేష్ ఆదేశాలు లేకుండా ఇక్కడ నాయకులు ఎలా పోటీలో ఉన్నామని చెబుతారు. నిర్ణయం తీసుకునే ముందు తండ్రి కొడుకులు ఇద్దరూ మాట్లాడలేదా లేక చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్న అన్నది లోకేష్ స్పష్టం చేయాలి.
 
రాష్ట్రంలో అందరికీ ఒక న్యాయం లోకేష్ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులకు ఒక న్యాయమా, దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు లోకేష్ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారా. తీసుకొని ఉంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ ఎలా వ్యతిరేకిస్తున్నాడు.
 
ఇవాళ దుగ్గిరాల మండలం లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చేసే విధానం తో చంద్రబాబు లోకేష్ మధ్య విభేదాలు ఉన్నాయని అర్థమవుతుంది. దుగ్గిరాల మండలం లో పోటీ చేస్తానంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 18 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 14 గెలుచుకుంటే తెలుగుదేశం మద్దతు ధర కేవలం రెండు మాత్రమే గెలుచుకున్నారు.

చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ దుగ్గిరాల లో పోటీ చేస్తున్నాడు. దుగ్గిరాల లో ఉన్న పసుపు వ్యాపారులంతా వాళ్ళవాళ్లే. వ్యాపారం అడ్డంపెట్టుకుని కోట్లాది రూపాయల గుమ్మరించి బెదిరించి దుగ్గిరాలలో గెలుపొందాలని లోకేష్ భావిస్తున్నారు. లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 18 ఎంపిటిసి స్థానాలకు 17 స్థానాలు గెలుస్తాం. దుగ్గిరాల జడ్పిటిసి స్థానానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు.