శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (09:47 IST)

చంద్రబాబు తిరుమల పర్యటన వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల పర్యటన వాయిదా పడింది. ఏటా మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చి, నిత్యాన్నదాన పథకానికి ఒక రోజు ఖర్చయ్యే మొత్తాన్ని విరాళంగా టీటీడీకి అందజేస్తుంటారు.

ఈసారి తిరుమల పర్యటన రద్దయినట్టు తెలిసింది. అయితే విరాళం మొత్తాన్ని మాత్రం అక్కడినుంచే టీటీడీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. 
 
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం 49433 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5కోట్ల 03లక్షల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

26119 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 8 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనుంది.