శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:56 IST)

విద్వేషపూరిత రాజకీయాలకు తెరలేపిన వైకాపా : ధూళిపాళ్ల నరేంద్ర

రాష్ట్రంలో కొత్త రాజకీయపరిస్థితులను చూస్తున్నామని, సిద్ధాంతపరమైన రాజకీయాలస్థానంలో విద్వేషపూరిత రాజకీయాలకు అధికార పార్టీ తెరలేపిందని టీడీపీ సీనియర్ నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించా రు. ఉమ్మడి రాష్ట్రంలోకూడా ఎప్పుడూ ఇటువంటి పరిణమాలు చూడలేదన్నఆయన, ప్రభుత్వాలు పాలకులు మారినా, సిద్ధాంతపరమైన ఆలోచనలతోనే గతంలోప్రభుత్వా లు నడిచాయన్నారు. 
 
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయాక అమరావతిని రాజధానిగా ప్రకటించాక, ప్రతిపక్షంలో ఉండి మద్ధతుప్రకటించినవారు, అధికారంలోకి వచ్చాక కులం, మతంపేరుతో రకరకాలైన విమర్శలు దిగా రన్నారు. అలానే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రతిక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పెద్దఎత్తున ప్రచారం చేశాడన్నారు. 
 
ఆయన అధికారంలోకి వచ్చాకకూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రవర్తించారో, ఇప్పుడుకూడా అలానే ప్రవర్తిస్తున్నారన్నా రు. అమరావతిని మారుస్తారని చెప్పగానే ఆప్రాంతంలోని దళితులు, ముస్లింలు, బడుగుబలహీనవర్గాలవారు ముందుండి నేటికీ ఉద్యమాన్ని ఎలా నడిపిస్తున్నారో చూస్తునే ఉన్నామన్నారు. అధికారాన్ని ఉపయోగించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ పెద్దఎత్తున కేసులునమోదుచేస్తే, దానిపై హైకోర్టు 90 పేజీల తీర్పుని వెలువరించిందని, రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది లేనేలేదని, ఆ పదం అసలు అక్కడ వర్తించదని చాలాస్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. రిజిస్టర్ అయిన కేసులను కూడా న్యాయస్థానం కొట్టేసిందన్నారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో కొత్తగా ముఖ్యమంత్రి మరో జగన్నాటకానికి తెరతీశారని, అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ, సీఐడీ కేసులుపెట్టి, చంద్రబాబునాయుడుకి నోటీసులుఇచ్చారని నరేంద్ర తెలిపారు. బాధితులు ఎవరైనా ఉన్నారాఅంటే, దళితులు ఎవరూలేరని, ఫిర్యాదు చేసిన రామకృష్ణా రెడ్డి దళితుడుకాడని, అటువంటప్పుడు అతని ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని ఎస్సీఎస్టీ కేసు ఎలా నమోదుచేవారని నరేంద్ర నిలదీశారు. అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి, కేసులకట్టుకథలు అల్లారన్నారు. 
 
ఆళ్లరామకృష్ణా రెడ్డి వద్దకు ఎవరోవచ్చారని, రాజధాని వస్తే తమభూములు పోతాయని భయపడినవారు, వాటిని అయినకాడికి అమ్ముకున్నారని, ఆవిధంగావారిని భయపెట్టి భూములుతీసుకున్నట్లు చెప్పడంతో, దానిపై 24వతేదీన రామకృష్ణారెడ్డి ఫిర్యాదుచేశారని చెప్పడం జరిగిందన్నారు. తరువాత 12వ తేదీన కేసురిజిస్టర్ చేశారన్నారు. బాధితులు ఎవరూ ఫిర్యాదుచేయకుండా, ఆళ్లరామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే, దానినాధారం చేసుకొని ఎస్సీ,ఎస్టీ కేసు ఎలా పెడతారని నరేంద్రకుమార్ ప్రశ్నించారు. 
 
ఆళ్ల రామకృష్ణారెడ్డికి అంతటి అత్యుత్సాహం ఎందుకో, సీఐడీ ఆయనిచ్చిన ఫిర్యాదు పై ఎస్సీ, ఎస్టీ కేసు కట్టడమేంటన్నారు. రాజధానిపై ఇదివరకే చిమ్మాల్సినదానికంటే ఎక్కువగానే వైసీపీ విషం చిమ్మిందని, అదంతా నీరుగారిపోవడంతో జగన్ నాయకత్వంలో మరో కొత్తనాటకానికి అధికారపార్టీ తెరతీసిందన్నారు. రాజధాని మొత్తమ్మీద ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నది 2,200 ఎకరాల అసైన్డ్ భూమిమాత్రమేనని, ఆ భూమి ఇచ్చిన వారెవరూ తమకు అన్యాయం జరిగిందని ఎక్కడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవన్నారు. 
 
ఆ భూములిచ్చినవారే నేడు అమరా వతి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని టీడీపీనేత తెలిపారు. దేశంలో భూసేకరణ ఎక్కడజరిపినా అనేకఉద్యమా లు, ప్రతిఘటనలు జరిగాయని, కానీ అమరావతిని రాజధాని గా ప్రకటించాక, ప్రజలుస్వచ్ఛందంగా భూములిచ్చారన్నా రు. ఆ వ్యవహారంలో చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ చేసిన తప్పేమిటోచెప్పాలని నరేంద్ర డిమాండ్ చేశారు. రాజ ధానిప్రాంతంలోని దళితులందరికీ న్యాయం జరిగేలా నాటి టీడీపీప్రభుత్వం జీవో నెం-41 విడుదలచేసిందని, ఆ జీవోలో అసైన్డ్ భూమిహక్కుదారులందరికీ, రెసిడెన్షియల్ ల్యాండ్ 1000 గజాలు, కమర్షియల్ ల్యాండ్ 200గజాలు ఇవ్వడం జరిగిందన్నారు. జరీబుభూములకు 1000గజాల రెసిడెన్షి యల్ ల్యాండ్, 450గజాల కమర్షియల్ ల్యాండ్ ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. 
 
1954కు ముందు కొన్న అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, వాటికి 1000 గజాల రెసిడెన్షియల్ ల్యాండ్, 200 గజాల కమర్షియల్ ల్యాండ్ కేటాయింపులు చేయడంజరిగిందన్నారు. 1954 తర్వాత కొన్నభూములకు 800గజాల రెసిడెన్షియల్ ల్యాండ్, 100గజాల కమర్షియల్ ల్యాండ్ ఇచ్చేలా నిర్ణయించడం జరి గిందన్నారు. అవికాకుండా గవర్నమెంట్ భూములు ఎవరైనా కొనిఉంటే, వాటికికూడా ఎలాకేటాయింపులు చేయాలనే దానిపై జీవోనెం-41లో విస్పష్టంగా చెప్పడం జరిగిందని నరేంద్ర తెలిపారు. 
 
న్యాయ, మున్సిపల్, రెవెన్యూ శాఖలన్నీ పరిశీలించి, చర్చించాకే ఆనాటి ప్రభుత్వం జీవోనెం-41 విడుదల చేసిందన్నారు. రాజధాని ప్రాంతంలోని ఏఒక్క దళితరైతు నష్టపోకుండా, మిగతారైతులమాదిరే, దళితులకు కూడా భూహక్కులు కల్పిస్తూ,  జీవోనెం-41 తీసుకొచ్చిందన్నారు.  ఆవిధంగా రాజధానిప్రాంతంలోని రైతులందరికీ కేటాయింపు లు చేయడం జరిగిందన్నారు. ఉద్దేశపూపర్వకంగా దళితులకు అన్యాయం జరుగుతుందని వైసీపీభావించినట్లయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినఈరెండేళ్ల కాలంలో జీవోనెం-41పై  ఎందుకు మాట్లాడలేదన్నారు.  
 
వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లతర్వాత జీవో నెం-41ద్వారాదళితులకు అన్యాయం జరిగిందని జగన్ ప్రభుత్వం చెప్పడం, దానిపైకేసులు నమోదుచేయడం ఎంత వరకు సమంజసమన్నారు. వైసీపీప్రభుత్వం విశాఖపట్నం సహాచుట్టుపక్కలున్న దళితులభూములను  సేకరించడా నికి జీవో నెం72 విడుదలచేసిందని, దానిలో దాదాపు 5,400 ఎకరాలు సేకరించాలని చెప్పడం జరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకోవాలనుకున్నభూముల్లో అసైన్డ్ భూములు, అంక్రోచ్ మెంట్ ల్యాండ్స్, ప్రొబేటీరీ ఆర్డర్ బుక్ లో ఉన్న భూములు కూడా ఉన్నాయన్నారు. 
 
అవికాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వభూములు మరో 750 ఎకరాలవరకు ఉన్నాయన్నారు. మొత్తంకలిపి 6,116ఎకరాల భూములను  తీసుకోవడానికి ల్యాండ్ పూలింగ్ పై వైసీపీప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు.  అమరావతిలోని దళితులకు గతప్రభుత్వం ఎలాగైతే భూములివ్వాలని నిర్ణయించిందో, ఆనాడు విడుదల చేసిన జీవోనెం-41ను ఆదర్శంగా తీసుకొనే నేటి జగన్ ప్రభుత్వం జీవోనెం-72విడుదల చేసిందని నరేంద్ర పేర్కొన్నా రు.  విశాఖపట్నం ప్రాంతంలోని దళితులకు కూడా అమరావతి ప్రాంతంలోని దళితులకు ఇచ్చినట్లే డెవలప్డ్ ల్యాండ్స్ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. 
 
టీడీపీ ప్రభుత్వం విడుదలచేసిన జీవోనెం-42 దళితులకు నష్టం కలిగించేదయితే, అదేజీవోని ఆదర్శంగా చేసుకొని వైసీపీప్రభు త్వమిచ్చిన జీవోనెం-72 దళితులకు నష్టంకలిగించదా అని మాజీఎమ్మెల్యే నిగ్గదీశారు.  వైసీపీప్రభుత్వమిచ్చిన జీవోనెం -72 తప్పయితే, జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ శాఖామంత్రి పై సీఐడీఎప్పుడు కేసులుపెడుతుందో చెప్పాలని నరేంద్ర  డిమాండ్ చేశారు.  ప్రభుత్వాలనేవి ఎప్పుడైనా ఒకేరకంగా ఉండాలని, గతప్రభుత్వం చేసింది తప్పనిచెబుతూనే, అదే ప్రభుత్వవిధానాలను ఇప్పుడున్నవారు ఎలాఅమలు చేస్తార న్నారు. దళితుడుకాని రామకృష్ణారెడ్డి చెప్పాడని చెప్పి కేసులు నమోదుచేయడం చాలాఆశ్చర్యాన్ని కలిగిస్తోం దన్నారు. 
 
రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం క్రిమినల్ ఇన్విస్టిగే షన్ డిపార్ట్ మెంట్ గాకాకుండా, క్రిమినల్ ఇన్ ఫ్లూయెన్స్ డ్ డిపార్ట్ మెంట్ గా వ్యవహరిస్తోందని నరేంద్ర ఎద్దేవాచేశారు. క్రిమినల్స్ ను విచారించాల్సిన సీఐడీ, క్రిమినల్స్ ప్రభావానికి లొంగిపోవడం బాధాకరమన్నారు. రాజకీయపరంగా, సిద్ధాంతపరంగా తమతోవిబేధించేవారిపై తప్పుడుకేసులు పెట్టడానికే ఈప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోం దన్నారు. గతంలోకూడా రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు చంద్రబాబునాయుడిపైకేసులు వేసి ఉపసంహరించు కున్నాడని, విజయమ్మకూడా అలానేచేసిందని, ఈప్రభుత్వంకూడా ఏబీకే.ప్రసాద్ తో కేసులువేయించి, తరువాత తప్పుకుందన్నారు. 
 
చంద్రబాబునాయుడి ప్రభు త్వం తీసుకున్నవిధానపరమైన నిర్ణయాలపై , అధికారంలోకి వచ్చాక రాజశేఖరెడ్డి ప్రభుత్వం 22కమిటీలు వేసిందని, చివరకు వాటన్నింటినీ ఉపసంహరించుకుందన్నారు.  అధి కారాన్ని అడ్డుపెట్టుకొని, అహంకారంతో, డబ్బుతో గెలిచామ నేవాస్తవం వైసీపీవారికి కూడా తెలుసునని, ఏదోరకంగా చంద్రబాబునాయుడిపై బురదజల్లాలనే ఈనాడు నోటీసులు ఇచ్చారన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిప్రభుత్వంలో చేసిన తప్పులకు అనేకమంది అధికారులుఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరుగుతూనేఉన్నారనే వాస్తవాన్నిఇప్పుడు ప్రభుత్వపెద్దలమెప్పుకోసం పనిచేస్తున్న అధికారులంతా గుర్తుంచుకోవాలని నరేంద్రహితవుపలికారు. 
 
పోలీస్ ఉన్నతా ధికారులంతా చట్టంఎవరికైనా ఒక్కటేననే వాస్తవాన్ని గ్రహిం చాలన్నారు.అక్రమ విధానాలను ఆచరించే ప్రతిఅధికారి జైలు తలుపుతట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రం దందాలకు నిలయంగా మారిందని, పెద్దమనుషుల ముసుగులో వైసీపీ వారుచేస్తున్న అక్రమాలపై విచారణజరిపితే, వారిని అరెస్ట్ చేసిజైళ్లకుపంపితే, రాష్ట్రంలోని జైళ్లుకూడా సరిపోకపోవవచ్చ ని నరేంద్ర అభిప్రాయపడ్డారు. తెలుగుదేశంపార్టీగానీ, టీడీపీ ప్రభుత్వంగానీ విశాలమైన ప్రయోజనాలకోసమే పనిచేసింద ని, రాజధానిప్రాంతంలోని దళితులహక్కులను కాపాడేవిధం గానే నాటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం వ్యవహరిచింద న్నారు. అదికేవలం చంద్రబాబునాయుడు ఒక్కడే తీసుకున్న నిర్ణయంకాదని, పాలసీ డెసిషన్ అని నరేంద్ర తెలిపారు. 
 
ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టని వ్యక్తులు, నేడు దళితుడుకాని దళితుడైన రామకృష్ణారెడ్డిని అడ్డుపెట్టుకొని కక్షసాధింపులకు పాల్పడాలని చూస్తోందన్నా రు. ఎస్సీ,ఎస్టీకేసులు పెట్టడంలో జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం రికార్డు సృష్టించేలా ఉందన్నారు.  దేశంలో ఉన్న కేసులన్నింటిపై స్టేలు ఎత్తేసి, వాటిని సత్వరమేవిచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించినాకూడా, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమకేసులవిచారణ ఎందుకు ముందుకు సాగడంలేదో వైసీపీనేతలు, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. చంద్ర బాబు విచారణకు హాజరైతే తప్పేమిటంటున్న వైసీపీనేతలం తా, జగన్మోహ న్  రెడ్డి అక్రమాస్తుల కేసులవిచారణ ఎందుకు ముందుకు సాగడంలేదో చెప్పాలన్నారు. లాయర్లమీద లాయర్లను పెడుతూ, డబ్బులువెదజల్లుతూ తనపైఉన్న కేసులవిచారణలో జాప్యంజరిగేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నది వాస్తవమో కాదో వైసీపీనేతలే చెప్పాలన్నా రు.  
 
వైసీపీనేతలు, ఎదుటివారినిప్రశ్నించేముందు, వారి నాయకుడిపై ఉన్నఅభియోగాలు, కేసులపై వారేం సమాధానంచెబుతారని నరేంద్ర ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలచేతుల్లో పావులుగా మారినపోలీస్ అధికారులంతా భవిష్యత్ లో మూల్యంచెల్లించుకొని తీరుతారన్నారు.  జీవోనెం -41 తప్పని చెప్పి, చంద్రబాబునాయుడిపై ఎస్టీ, ఎస్సీ కేసు నమోదుచేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదేజీవోని ఆధా రంగా చేసుకొని జీవోనెం-72ఎందుకు తీసుకొచ్చిందో చెప్పా లన్నారు. చంద్రబాబునాయుడిపై ఎస్సీఎస్టీకేసులుపెట్టినప్పు డు జగన్ పై, మున్సిపల్ శాఖామంత్రిపై కూడా కేసులు పెట్టాలికదా అని నరేంద్ర ప్రశ్నించారు. 
 
చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిశారని, జగన్ చరిత్ర కూడా అదే విధంగా ముగుస్తుందన్నారు. ఇళ్లపట్టాల పేరుతో వేలాది ఎకరాలు లాగేసుకున్న జగన్ ప్రభుత్వం, ఇండస్ట్రీలపేరుతో దళితులనుంచి లాక్కున్న భూములనే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిందని విలేకరులు అడిగినప్రశ్నకు సమాధానంగా న రేంద్ర కుమార్ తెలిపారు. వేలాదిఎకరాల దళితుల భూముల ను జగన్ ప్రభుత్వమే లాక్కుందని, భూమికోసం ఎవరైనా ముందుకొస్తే, పోలీసులసాయంతో వారిపై తప్పుడుకేసులు పెడుతున్నారన్నారు.