బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (21:15 IST)

ఆలయాల పేరుతో చెత్త రాజకీయం చేస్తున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి

ఏపీలో ఆలయాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలో మతం పేరుతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల వైసీపీకి ఏం ప్రయోజనమని సజ్జల ప్రశ్నించారు. రాష్ట్రంలో భద్రత లేని ఆలయాలనే టార్గెట్‌గా చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
మతపరమైన అంశాలపై వైసీపీ ఎప్పుడైనా ఉద్యమం చేసిందా అని ప్రశ్నించారు. ‘‘ప్రజా సమస్యలు తీర్చడమే రాజకీయ పార్టీల పని. కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తోంది. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయం చేస్తున్నారు. మత రాజకీయాలతో దివాలా తీసిన టీడీపీకి లాభం. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నం అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 
 
ఇకపోతే, ఏపీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 20 వరకు పొడిగించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 39 శాతం ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని సీఎం తెలిపారు. లబ్ధిదారుడికి నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామన్నారు. 
 
ఇళ్ల స్థలాల పెండింగ్‌ కేసులను కలెక్టర్లు పరిష్కరించాలని సీఎం సూచించారు. దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇవ్వాలన్నారు. ప్రతి కాలనీ వెలుపల హైటెక్‌ రీతిలో బస్టాప్‌ తీర్చిదిద్దాలని జగన్ ఆదేశించారు. మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌ కూడా ఏకకాలంలో పూర్తి చేయాలన్నారు.