ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:47 IST)

అసైన్డ్ భూములను ఆక్రమించుకున్న ఘనుడు వైఎస్ఆర్ : నక్కా ఆనందబాబు

చంద్రబాబునాయుడిపై సీఐడీ అక్రమకేసులుపెట్టడాన్ని రాష్ట్రప్రజలంతా అసహ్యించుకుంటున్నారని, విశాఖఉక్కు ఉద్యమంసహా, ప్రజల్లో ప్రభుత్వంపైఉన్న వ్యతిరేకతనుంచి వారి దృష్టిని మళ్లించడానికే జగన్ ప్రభుత్వం సీఐడీతో ప్రతిప క్షనేతకు నోటీసులిప్పించందని టీడీపీసీనియర్ నేత, మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేక రులతో మాట్లాడారు.
 
ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టడం, దానిపై ఒక ఎఫ్ఐఆర్ నమోదుచేసి, సీఆర్పీసీ 41ఏ కింద మాజీముఖ్యమంత్రికి నోటీసులివ్వడం అప్రజాస్వామికమని విజ్ఞులంతా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం యొక్క దుష్టపోకడలు, నియంత్ర త్వ విధానాలపై వారు ఇంకామాట్లాడాలి. మేధావులమౌనం సమాజానికి కీడు చేస్తుంది. ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయపార్టీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి, జగన్ ప్రభుత్వ విధానాలను ఖండించాలి. 
 
అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూసేకరణ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. దానికోసం ఆనాడు జీవోనెం-41 తీసుకొచ్చింది. ఆ జీవోప్రకారం అసైన్డ్ భూములున్నవారికి కూడా పట్టాదారులతో సమానంగా ప్రయోజనాలుకలిగేలా నాటి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ జీవోను ఆధారంగా చేసుకొని చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. మరి అదే జీవోను ఆధారంగాచేసుకొని వైసీపీ ప్రభుత్వం జీవోనెం-72 ఏవిధంగా తీసుకొచ్చిందో సమాధానం చెప్పాలి. 
 
వేలాది ఎకరాల అసైన్డ్ భూములను సేకరించడానికి జగన్ ప్రభుత్వం ఇప్పుడు జీవోనెం-72 ఎలా తీసుకొచ్చింది? వైసీపీ అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా అమరావతిలో నేరాలుఘోరాలు జరిగిపోయాయని, వాటిని ఊడబీకుతామ నిపెద్దపెద్ద మాటలు మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక, 8 మంది మంత్రులతో ఉపసంఘం వేశారు. సిట్ బృందాన్ని విచారణకు నియమించారు. అధికారులతో కమిటీలు వేశారు. సిట్ బృందాలు, మంత్రివర్గ ఉపసంఘాలు, అధికారుల కమిటీలు అమరావతిభూముల్లో అవినీతి ఉన్నట్లు నిరూపించలేకపోయాయి. 
 
అవన్నీ అయ్యాక సీఐడీ పేరుతో నోటీసులిప్పించారు. వైసీపీఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుచేశాడని చెప్పి, మాజీముఖ్యమంత్రికి తప్పుడు నోటీసులిచ్చారు. వైసీపీ ప్రభుత్వం దళితులు గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చెప్పారు. ఇడుపులపాయలో 690 ఎకరాల వరకు దళితులభూములు వారిస్వాధీనంలో ఉన్నాయని ఆయనే అంగీకరించారు. 
 
దానిపై కోర్టులో కేసు వేస్తే, 300 ఎకరాలవరకు తిరిగి అప్పగిస్తామని, రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా అమరావతికోసం దళితరైతులు ఉద్యమం చేస్తుంటే, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించిన ఘనచరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దళితులపై లాఠీఛా ర్జ్ చేసి, వారిని రాళ్లతో కొట్టించారు. అటువంటి మీరు దళితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. దళితులకు కూడా పట్టాభూములున్నవారితో సమానంగా న్యాయంచేయాలని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ఆనాడు భావించారు. 
 
కేబినెట్ నిర్ణయాలు తీసుకొని, ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపాకే జీవోనెం-41 ఇవ్వడం జరిగింది. చంద్రబాబుఒక్కడే తప్పుచేశాడన్నట్లుగా ఆయనకి నోటీసులివ్వడం ముమ్మాటికీ కక్షసాధింపు చర్యల్లో భాగమే. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 104 సెజ్‌లకు భూకేటాయింపులు చేయడంకోసం దళితులకు చెందిన లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కాజేశాడు. వాటికి సంబంధించిన కేసుల్లోనే నేడు కూడా జగన్ కోర్టులచుట్టూ తిరుగతున్నాడు. రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగాఉన్న వారిని జగ న్ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. 
 
ఎన్నికల్లో గెలిచాం కదా అని, అమరావతిని ఆగమేఘాలపై తరలించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రికి నోటీసులిచ్చింది. చంద్రబాబు నాయుడిపై తప్పడుకేసులు పెట్టి, ప్రజలను అభద్రతాభావానికి గురిచేయాలన్న ఆలోచనలో ప్రభుత్వముంది. ఎస్సీ, ఎస్టీ కేసుని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అయిన రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయడమేంటి? దానిపై చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడమేంటి? 
 
ఎక్కడైనా బాధితులు ఫిర్యాదుచేస్తారు. వారెవరూ ఫిర్యాదుచేయ లేదు. ఏ దళితుడు తనకు అన్యాయం జరిగిందని చెప్పలేదు. ఎమ్మెల్యేకు ఎవరో చెబితే, ఆయన ఫిర్యాదు చేస్తే, దాన్నిఆధారం చేసుకొని చంద్రబాబుకు నోటీసులిస్తారా? అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, దళితుడైన జిల్లా కలెక్టరును పట్టుకొని పనికిమాలినోడు అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు.
 
ఆ ఎమ్మెల్యేను ఈ ప్రభుత్వం కనీసం వారించను కూడా వారించలేదు. అనంతపురంజిల్లా కలెక్టర్ విషయంలోజరిగింది నిజమైన అట్రాసిటీ అంటే. నూటికి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వైసీపీఎమ్మెల్యేపై పెట్టాలి. కానీ ప్రభుత్వం ఆపనిచేయలేదు. పనికిమాలిన కేసుల్లో ఎస్సీఎస్టీ చట్టాన్ని దుర్వినియోగంచేస్తున్నారు. దళితుల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ చట్టమనేది తీసుకొచ్చారు. అంతేగానీ రాజకీయకక్షల కోసం దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. జగన్ ప్రభుత్వతీరుపై దళితులంతా ఆలోచనచేయాలని కోరుతున్నాను అని నక్కా ఆనందబాబు చెప్పుకొచ్చారు.