బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:05 IST)

శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండలు పెరుగుతుండటంతో అటవీ ప్రాంతంలో మంటలు రాజుకుంటున్నాయి. తాజాగా కాకులకోన అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. ఈ ప్రాంతంలో మూడు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి.

తితిదే అటవీ విభాగం సిబ్బంది బ్లోయర్లు, చెట్టు కొమ్మల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం, గాలి వీస్తుండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి.
 
శేషాచలం అటవీ ప్రాంతంలోని వాచ్‌ టవర్ల ద్వారా సిబ్బందితో పర్యవేక్షిస్తున్న అటవీ విభాగం... మంటలు వ్యాపించిన ప్రదేశానికి చేరుకుని తీవ్రత ఎక్కువగా లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.