శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (11:24 IST)

తిరుపతి లోక్‌సభ కాంగ్రెస్ కంచుకోట: తులసిరెడ్డి

తిరుపతి లోక్‌సభ కాంగ్రెస్ కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయని...ఒకటి రెండు సార్లు కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో వెంకటేశ్వర స్వామినే బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. బీజేపీ మోసగారి తనం వైసీపీ, టీడీపీల చేతగానితనం వల్ల ప్రత్యేక హోదా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ వచ్చిందన్నారు.

దుగరాజపట్నం మేజర్ ఓడరేవు రాలేదని,  మన్నవరం ఫ్యాక్టరీ మూతబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలకు తిరుపతి లోక్‌సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించినట్లు పవన్‌ వెల్లడించారు.

ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని వారు గట్టిగా చెప్పారని తెలిపారు.