మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (11:29 IST)

అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ఈనెలలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సుకు అమిత్ షా హాజరుకావాల్సి ఉండగా అకస్మాత్తుగా పర్యటన రద్దు అయ్యింది.

ఈ నెల 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టారు. దానికి సంబంధించి తమినాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం వెళ్లింది.

అయితే అకస్మాత్తుగా అమిత్‌షా తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. ముఖ్యమంత్రుల సమావేశం రద్దు అయినట్లు కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెల్లడైంది.

కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆ వ్యవహారం తేలాకే రావాలని అమిత్ షా నిర్ణయించుకున్నట్లు సమాచారం.