శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:36 IST)

18న తిరుపతి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గిరీషా వెల్లడించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన గిరీషా.. తిరుపతి ఎమ్మెల్యే మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

లలితకల ప్రాంగణంలో ప్రమాణస్వీకారం జరుగనుందని తెలిపారు. కాగా.. గుంటూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, ఒంగోలు, కడప కార్పొరేషన్లను వైసీపీ కైవసం చేసుకుంది.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీ ఫ్యాన్ హవా నడుస్తోంది. మరికొన్ని చోట్ల టీడీపీ-వైసీపీ పోటాపోటీగా ఉంది.

ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే వైసీపీ 57 కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆరు కార్పొరేషన్లలో వైసీపీ గెలిచింది.