మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 20 మార్చి 2021 (17:09 IST)

జగన్ గారి అబ్బదెబ్బ ఎలా ఉంటుందో నీయబ్బను లేపి అడుగు పప్పూ: కొడాలి నాని

ఎవరు ఏ కేసు పెట్టినా కోర్టుకు పరిగెత్తి స్టేలు తెచ్చుకోవటంలో చంద్రబాబు దిట్ట. మళ్లీ నిన్న కూడా హైకోర్టు నుంచి 31వ స్టేను చంద్రబాబు తెచ్చుకున్నాడంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేసారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ కేసులను ఎదుర్కోలేక అతి ఎక్కువ స్టేలు తెచ్చుకున్న నాయకుడుగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చంద్రబాబు ఎక్కాడు. దేశంలో సుప్రసిద్ధ లాయర్లకు కోటాను కోట్లు ఇచ్చి చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారు.

చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమంటే చేసిన దొంగ పనులకు సమాధానం చెప్పలేని స్టేల బాబు.. చంద్రబాబు. ఆయన పుత్రరత్నం పప్పు.. నిన్నా, ఈరోజు ట్విట్టర్‌లో ఎంటరైపోయాడు. వారం రోజుల క్రితం మున్సిపల్ ఫలితాలతో ప్రజలు మూతిమీద కొడితే.. పప్పు తిని ఇంట్లో పడుకున్నారు. నిన్న నిద్రలేచి శ్రీ జగన్ గారిపై అనుచితంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దున్నపోతు శరీరం.. తలకాయలో కొద్దిగా బుర్రలేని పనికిమాలిన వ్యక్తి లోకేశ్. పైగా వర్థంతి, జయంతికి తేడా తెలియదు. 
 
2004 ఎన్నికల్లో చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ దెబ్బ ఏంటో చూపించారు. 2009లో తుప్పు నాలుగు పార్టీలను కలుపుకొని మహా కూటమిగా గుంపులు గుంపులుగా వస్తే.. సింహం సింగిల్‌గా ఎలా కొడుతుందే వైయస్‌ఆర్‌ దెబ్బ చూశారు. ఎన్నికల్లో రెండుసార్లు వైయస్‌ఆర్‌ దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబు చవి చూశారు. ఆ దెబ్బకు చంద్రబాబు ఏ దిక్కుమాలిన పరిస్థితికి వెళ్లారో రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా కూడా చూశారు.

శ్రీ జగన్ గారి అబ్బదెబ్బ ఎలా ఉంటుందో నీయబ్బను లేపి అడుగు పప్పూ. వైయస్‌ఆర్‌ దెబ్బ ఎలా ఉంటుందో పప్పుకు తుప్పు కథలు కథలుగా చెబుతాడు. 2019 ఎన్నికల్లో శ్రీ జగన్‌ గారు నీ తండ్రిని (చంద్రబాబును) 23 సీట్లకే పరిమితం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాలుగు గోడలకే పరిమితమైన పరిస్థితి తెచ్చారు. శ్రీ జగన్ గారి దెబ్బ ఏంటో తెల్సుకోవటానికి బాబు, కొడుకులు ఇంకొంత కాలం జీవించి ఉండాలి. ఆరు నెలలకో, మూడు నెలలకో పెరోల్ మీద వచ్చిన ఖైదీలా నాలుగురోజులు రోడ్ల మీద తిరిగి ఇంటి దగ్గర పడుకుంటున్నారు. పప్పు, తుప్పులు జీవిస్తున్న బ్రతుకు... జైలు జీవితం కాదా.   
 
ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి తొలగించి... సస్పెండ్ చేసి ఈ పార్టీ నాదే అని లాక్కొన్నారు. టీడీపీ .. ఎన్టీఆర్‌ ట్రస్టు పేరు మీద ఉన్న ఆస్తులు నావే అని ఆ డబ్బులు ఎన్టీఆర్‌ వాడుకోవటానికి వీల్లేదని ఆనాడే కోర్టు నుంచి స్టేను చంద్రబాబు తెచ్చారు. దీనిబట్టే ఏ రకంగా కోర్టుల్లో స్టేలు తెచ్చుకోగలడో, ఏరకంగా లాయర్లతో వాదించగలడో.. ఏ రకంగా బ్రోకరు పనులు చేస్తావో ఎన్టీఆర్‌ సంఘటన ఒక ఉదాహరణ అని కొడాలి నాని మండిపడ్డారు.

చంద్రబాబు ఎంత నీచుడో, ఎంత బ్రోకరు పనులు చేయగలడో ఎన్టీఆరే చెప్పారని కొడాలి గుర్తు చేశారు. అదే విధంగా సైకిల్ గుర్తు కోసం కోర్టులో ఎలాంటి వ్యవహారాలు నడిపారో రాష్ట్ర ప్రజలందరికీ తెల్సు. ఉచ్ఛం, నీచం లేనటువంటి వెధవని చంద్రాబుపై కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో స్టేలు తెచ్చుకోవటం కోసం.. డబ్బు ఖర్చు పెట్టడమే కాదు.. దానికోసం ఎవరినైనా పంపించి ఏమైనా మేనేజ్‌ చేయగల బ్రోకర్ చంద్రబాబని కొడాలి ఫైర్‌ అయ్యారు. 
 
చంద్రబాబు చేసిన తప్పులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చాయో వాటిపై తప్పకుండా కేసులు పెడతాం. పైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ ప్రజలంతా చూస్తున్నారు. న్యాయ స్థానాల్లో శిక్షలు పడకపోతే.. ప్రజాకోర్టులో ప్రజల చేత శిక్ష వేయించే దమ్ము, ధైర్యం శ్రీ జగన్ గారికి ఉంది. ఇప్పటికే చంద్రబాబును ప్రజలు చీత్కరించారు. టీడీపీని 35% ఓటింగ్‌కు మాత్రమే తెచ్చారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు 20%-25% మాత్రమే పరిమితం చేయనున్నారు. తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిని 4 లక్షలు పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తారు. తద్వారా చంద్రబాబు చేసిన ద్రోహాలు, దొంగతనాలు, అవినీతికి రాష్ట్ర ప్రజలు శిక్ష వేయటానికి సిద్ధంగా ఉన్నారు. 
 
చంద్రబాబు కోర్టుల్ని మేనేజ్ చేయొచ్చు. దానికోసం లాయర్లు పెట్టి వాదించుకోవచ్చు. కానీ ఇప్పటికే చంద్రబాబుకు ప్రజాకోర్టులో రాష్ట్ర ప్రజలు ఉరిశిక్ష వేశారు. ఇంట్లో ఉంటే ఏమిటి, జైల్లో ఉంటే ఏమిటని చంద్రబాబును ఇంటికే పరిమితం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని లోకేశ్‌, టీడీపీ నాయకులు మాట్లాడాలి. పప్పూ స్టాన్‌ఫర్డ్స్‌లో రామలింగరాజు డబ్బులతో చదివారు. అమెరికాలో లోకేశ్‌ చదువుకోవటానికి డబ్బులు ఎవరు పంపించారని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేశ్ స్టాన్‌ఫర్డ్‌ చదువుకోవటానికి అయిన వివరాలన్నీ లోకేశ్‌ బయటపెట్టాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

లోకేశ్‌ చదువుకు అయ్యే డబ్బును చంద్రబాబు పంపించారా అని కొడాలి ప్రశ్నించారు. ఏ సంబంధం లేని రామలింగరాజు లోకేశ్‌ చదువుకు డబ్బులు పంపించారు. లోకేశ్ చదువుకోవటానికి అవినీతి డబ్బు కావాలి. బుర్రలేని వెధవకు స్టాన్‌ఫర్డ్‌ సర్టిఫికెట్ ఇస్తుందా? వర్థంతి, జయంతికి తేడా తెలియదు. అలాంటి వ్యక్తి మూడు శాఖలు వెలగబెట్టి మా నాన్న, మా తాత.. ముఖ్యమంత్రి అని చెప్పుకోవటం ఏంటి? మంగళగిరిలో ఓడిపోయిన వెధవ .. పిచ్చి వాగుడు వాగొద్దని కొడాలి నాని హెచ్చరించారు. 
 
ఐదు కోట్ల ప్రజలు పప్పూ, తుప్పులను చీదరించుకున్నా.. వారికి ఇంకా బుద్ధిరాలేదు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టం. కాళ్లు పట్టడం, చంకలు నాకటం చంద్రబాబు రక్తంలోనే ఉంది. ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టిన వ్యక్తి శ్రీ జగన్ గారు మాత్రమే. ఎవరినో నమ్ముకొని పార్టీని శ్రీ జగన్ గారు పెట్టలేదు. ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి రావటం వల్లనే ఇన్ని ఘన విజయాలను సాధించారు. వైయస్‌ఆర్‌ ఆశయాలు, సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం శ్రీ జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. తను చేసే కార్యక్రమాలు, సిద్ధాంతాలు ప్రజలకు చెబుతున్నారు. ప్రజలకు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని సకాలంలో చేస్తూ ప్రజల మన్నలు శ్రీ జగన్ పొందుతున్నారు. 
 
అందితే జుట్టు పట్టుకోవటం, లేకపోతే కాళ్లు పట్టుకోవటం, వెన్నుపోట్లు పొడవటం, నమ్మించి మోసం చేయటం, 600పైగా దొంగ వాగ్ధానాలు చేసి ప్రజలను విస్మరించిన చరిత్ర చంద్రబాబుదే. నీచాతి నీచమైన చరిత్ర పప్పూ, తుప్పూలదే. అధికారం కోసం అడ్డదారులు తొక్కేది మీరే. విశాఖ స్టీల్‌ ప్లాంట్ కేంద్ర పరిధిలోనే ఉండాలని ఆ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. చంద్రబాబుకు, లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. మోడీని ప్రశ్నించండి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఢిల్లీ వచ్చి ప్రధాని మోడీ కాలర్‌ పట్టుకుంటామని హెచ్చరించండి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజకీయాల కోసం పిచ్చిపిచ్చి ట్వీట్లు చేయవద్దు. ఇలాంటి వ్యక్తులు మన ప్రాంతంలో పుట్టడం దురదృష్టం. 
 
గతంలో నల్ల చొక్కాలు వేసి ధర్మపోరాట దీక్షలు చేశారు. ఇప్పుడు బట్టలు లేకుండా వెళ్లి ఢిల్లీలో నిరసన తెలియజేయండి. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవటం కోసం వైయస్‌ఆర్‌సీపీ కూడా పోరాడుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు, 60% మంది పైగా ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి, శ్రీ జగన్‌ గారికి మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, ప్రజల హక్కుల కోసం మోడీగారితో అయినా సరే పోరాటం చేయటానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది అన్నారు నాని.