గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:47 IST)

లోకేష్‌కు కేసీఆర్‌ ఫోన్...ఎందుకో తెలుసా?

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కమిషనర్‌ డీఎస్‌ లోకే‌ష్‌కుమార్‌కు ఫోన్‌ చేశారు. ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్‌ చేయించాలని సూచించారు. వెంటనే అప్రమత్తమైన లోకేష్‌ జోనల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సంస్థలోని ప్రతి ఒక్క ఉద్యోగికి వ్యాక్సిన్‌ వేయించాలని, ఈ నెల 15వ తేదీలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రోజుకారోజు వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపడంతోపాటు కొవిడ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

జీహెచ్‌ఎంసీలో రెగ్యులర్‌ ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు 30 వేల మంది ఉన్నారు. వీరిలో మెజార్టీ కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొననుండగా, ఇంకొందరు కార్యాలయాల్లో పౌర సేవలందిస్తున్నారు.

15వ తేదీ అనంతరం అధికారులు, ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ వేసుకునే కార్యాలయానికి రావాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.