1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 9th class student dies of cardiac arrest in Telangana

తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి

heart stroke
తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎం. రాజేష్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరవుతుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
 
స్కూల్ టీచర్లు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ 46 ఏళ్ల వ్యక్తి మరణించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. రామాంతపూర్ ప్రాంతంలోని ఓ ప్లేగ్రౌండ్‌లో కొంతమంది స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతూ కె.కృష్ణారెడ్డి కుప్పకూలిపోయాడు.
 
గత వారం, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో 16 ఏళ్ల విద్యార్థిని తన కళాశాల వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం
సూర్యరశ్మి - జంక్ ఫుడ్స్‌తో కంటి చూపుకు చేటు : డాక్టర్ అమర్ అగర్వాల్