బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (10:05 IST)

ముందు తెలంగాణ అవినీతి చూసుకోవాలి.. కేసీఆర్‌పై శివరాజ్ ఫైర్

shivraj singh chowhan
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఇతర రాష్ట్రాల అవినీతి గురించి మాట్లాడే ముందు తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి చూసుకోవాలని హితవు పలికారు.  
 
కేసీఆర్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని, దేశంలోనే అవినీతికి తెలంగాణ కేరాఫ్ అయిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీఆర్ఎస్ పోటీ చేస్తే స్వాగతిస్తామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ వలంటీర్ వ్యవస్థ గురించి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు వాలంటీరు పోస్టు ఇస్తే వారు పార్టీ కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు. దానివల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.