1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (17:19 IST)

తెలంగాణలో బీఆర్‌ఎస్ 90కి పైగా సీట్లు గెలుస్తుంది.. కేసీఆర్ ధీమా

kcrao
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ 90కి పైగా సీట్లు గెలుచుకుంటుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో కూడా ఆరు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
 
 త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని, ఖమ్మంలో కూడా ఆరు సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
గత ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, అయితే రాష్ట్రవ్యాప్తంగా 83 సీట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 90కి పైగా సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు 85 వరకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.  జిల్లా నేతలంతా కలిసికట్టుగా పార్టీని గెలిపించాలని కేసీఆర్ సూచించారు. ఖమ్మం ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను నెరవేర్చామని గుర్తు చేశారు.
 
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించామని, రుణమాఫీ సమస్యను పరిష్కరించామని, ప్రజలకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలన్నింటినీ పూర్తి చేశామని కేసీఆర్‌ నేతలకు వివరించారు. ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజల డిమాండ్లన్నింటినీ నెరవేర్చామన్నారు.