సంబంధిత వార్తలు
- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్‌కు మంచు విష్ణు మంగళంపాడేనా! తాజా అప్డేట్!
- వివాహేతర సంబంధం.. యువకుడికి వాతలు పెట్టారు..
- రామ్ పోతినేని, శ్రీలీల పై నీ చుట్టు చుట్టు సాంగ్ చిత్రీకరణ
- సాక్షి ధోని నిర్మాతగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎల్జీఎం విడుదలకు సిద్ధం
- ఈ సినిమా చూసి శాఖాహారులు కూడా చికెన్ తినాలనుకుంటారు: హీరో నవదీప్
వేటకొడవలితో ఆటోడ్రైవర్‌పై దాడి.. భార్యతో సన్నిహితంగా వున్నాడని?
వివాహేతర సంబంధం కారణంగా ఆటో డ్రైవర్‌పై వేటకొడవలితో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆటో డ్రైవర్‌తో తన భార్య సన్నిహితంగా వుండటం చూసి అనుమానం పెంచుకున్న భర్త.. ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌పై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఖానాపురంకు చెందిన ఏ నాగరాజు, సతీష్ మంచి స్నేహితులు. నాగరాజు తన భార్యతో కలిసి రైతు బజార్‌లో కూరగాయలు విక్రయిస్తుండగా.. సతీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
నాగరాజుతో ఆమె భార్యతోనూ సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో నాగరాజు, తన భార్య- సతీష్ మధ్య వున్న సాన్నిహిత్యంపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య నుంచి దూరంగా వుండాలని హెచ్చరించాడు. అయినా ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు.
అంతే నాగరాజు వేట కొడవలితో సతీష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన సతీష్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.