ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (09:30 IST)

వివాహేతర సంబంధం.. యువకుడికి వాతలు పెట్టారు..

woman
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడు చిత్రహింసలకు గురయ్యాడు. యువకుడితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన నారాయణ అలియాస్ కిట్టు తూప్రాన్‌కు చెందిన సాయి, జితేందర్, మరో వ్యక్తి స్నేహితులు. 
 
ఆదివారం రాత్రి ఈ ముగ్గురూ కలిసి కిట్టూను తూప్రాన్‌కు పిలిచారు. మందేసి రాత్రి 11 గంటల సమయంలో వారు కిట్టూను విద్యుత్ తీగలతో కట్టేసి మర్మంగాలు, నాలుకతో పాటూ శరీరంపై పలు చోట్ల వాతలు పెట్టారు. 
 
బాధితుడి వారి నుంచి అతికష్టం మీద తప్పించుకుని హైవేపై ఉన్న ఓ దాబా వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం కిట్టు కుటుంబసభ్యులకు తెలిసి వారు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.