గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (13:08 IST)

కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

suicide
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెక్కండ మండలం, మూడు తండాల రాజేశ్వరి (20)ని ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన వాకుంతోడు రమేష్‌కు ఇచ్చి ఏడాది కింద పెండ్లి చేశారు. 
 
పెళ్లి సమయంలో పది లక్షల రూపాయల క్యాష్, ఐదు తులాల బంగారం ఇచ్చారు. కొన్నేళ్లుగా పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని రమేష్ భార్యను వేధిస్తున్నాడు. దీంతో భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. మూడు నెలల కింద రమేష్.. రాజేశ్వరిని తీవ్రంగా వేధించి కొట్టడంతో తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అక్కడికి వెళ్లినా భర్త నుంచి వేధింపులు ఆగలేదు. అంతే తీవ్ర మనస్తాపం చెందిన రాజేశ్వరి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.