1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. pstu entrance test 2023 revised timetable released

పీఎస్‌టీయూ సెట్‌కు కొత్త షెడ్యూల్.. ఆగస్టు 8, 9 తేదీల్లో..

Online Exams
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (పీఎస్‌టీయూ సెట్) కొత్త షెడ్యూలును వర్సిటీ అధికారులు జులై 31న ప్రకటించారు.

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కొత్త షెడ్యూలును విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఆరు కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 8, 9 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 
 
అభ్యర్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న పాత హాల్‌టికెట్లతోనే ప్రవేశ పరీక్షకు హాజరు కావొచ్చని చెప్పారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని అధికారులు సూచించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వేటకొడవలితో ఆటోడ్రైవర్‌పై దాడి.. భార్యతో సన్నిహితంగా వున్నాడని?