మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (11:20 IST)

మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్... వాతావరణ శాఖ హెచ్చరిక

rain
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీగా వానలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. 
 
ఇందులోభాగంగా, సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా జన్నారంలో 40.3 మిల్లీ మీటర్లు, మేడ్చల్ 37.5, మెదక్ జిల్లా కాగజ్ మద్దూర్ 35, యాదాద్రి జిల్లా బీబీనగర్ 27.5, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పూర్ 27, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్ 26.8, మేడ్చల్ జిల్లా కేశవరం 26, ఆలియాబాద్ 25, బండ మాదారంలో 24.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 
 
ఇంకా సంగారెడ్డి, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలతో పాటు, జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్‌పల్లి, బాచుపల్లి, సికింద్రాబాద్, నేరెడ్మెట్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 
 
అయితే, గత యేడాదితో పోలిస్తే ప్రస్తుత సీజనులో వర్షాలు 19 శాతం తక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గత ఏడాది జూన్ నుంచి జులై 30 వరకు 687.1 మిల్లీమీటర్ల వాన పడగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 559.1 మిల్లీమీటర్లు కురిసిందని తెలిపింది.