ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (07:30 IST)

ట్రాన్స్‌జెండర్‌గా మారిన యువకుడు మృతి... ఎలా?

transgender
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ విషాదకర ఘటన జరిగింది. ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఓ యువకుడు మృతి చెందాడు. రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వంరగల్ జిల్లా సంగెం మండలం తూర్పు తండాకు చెందిన బడవాత్ భీమ్ కుమారుడు అనిల్.. అనే 24 యేళ్ల యువకుడు ట్రాన్స్‌జెండర్‌‍గా మారాడు. హైదరాబాద్ నగరంలోని హిజ్రాలతో కలిసి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట వస్తుండగా మధ్యలో వారు మనసు మార్చుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
రఘనాథపల్లి స్టేషన్ వద్ద రైలు వేగం నెమ్మదించడంతో రైలు నుంచి కిందకు దిగబోయారు. ఆ ప్రయత్నంలో దివ్య అలియాస్ అనిల్ ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో బలమై గాయాలయ్యాయి. దీంతో దివ్య ప్రాణాలు కోల్పోయింది. జనగామ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.