ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (15:30 IST)

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే?

Rains
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక, నోయిడా రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
యమునా నదిలో నీటిమట్టం ప్రమాదస్థాయి కంటే అధికంగా చేరింది. రానున్న 24 గంటల్లో ఢిల్లీలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఢిల్లీ, గురుగ్రామ్, ఎన్సీఆర్‌లోని మానేసర్‌, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్, లోని దేహత్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.